అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mana Shankara Varaprasad Garu | మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu) ట్రైలర్ రిలీజ్ అయింది. తిరుపతిలోని ఎస్వీ సినీప్లెక్స్‌లో విడుదల చేశారు. కార్యక్రమానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి (Director Anil Ravipudi), నిర్మాతలు హాజరయ్యారు. 2 నిమిషాల 40 సెకన్ల పాటు సాగిన ట్రైలర్లో చిరంజీవి (Megastar Chiranjeevi) కామెడీ టైమింగ్‌తో అలరించారు. ట్రైలర్లో మెగాస్టార్ స్టైలిస్‌గా కనిపించారు. నయనతార- చిరంజీవి మధ్య సీన్స్ ఎంతో సరదాగా ఉన్నాయి. మొత్తానికి ట్రైలర్ చిరు ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చిందని చెప్పొచ్చు.
Mana Shankara Varaprasad Garu | మెగాస్టార్ జోడిగా నయన తార
‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటించారు. అలాగే విక్టరీ వెంకటేశ్ కూడా కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో కనబడనుండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల రిలీజైన వీరిద్దరి కాంబినేషన్లోని సాంగ్ అదరగొట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇప్పటి వరకు రిలీజైన సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా.. ఈ సాంగ్స్‌కు భీమ్స్ మ్యూజిక్ అందించారు.
సంక్రాంతి కానుకగా..
‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) రాజాసాబ్ మూవీ కూడా జనవరి 9న రిలీజ్‌కు సిద్ధమైన విషయం తెలిసిందే. దాంతో ఈ సారి బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి పోటీ గట్టిగానే ఉండనుంది.
