అక్షరటుడే, మెండోరా: Mendora Police | కూతురిని హత్య చేసిన వ్యక్తికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఇందుకు సంబంధించిన వివరాలను మెండోరా ఎస్సై సుహాసిని (Mendora SI Suhasini) వెల్లడించారు. మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామంలో (Bussapur village) కడమంచి కాశీరాం అనే వ్యక్తి తన కూతురిని హత్య చేసిన కేసులో అతడిపై 2023లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి ఛార్జిషీట్ దాఖలు చేశారు.
Mendora Police | సాక్ష్యాధారాలు సమర్పించి..
ఈ కేసులో ప్రభుత్వ న్యాయవాదులు బి.వసంత్, ఆర్.దయాకర్ గౌడ్ కోర్టులో సాక్ష్యాలను ప్రవేశపెట్టారు. పరిశీలించిన నిజామాబాద్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ నిందితుడికి ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం జీవిత ఖైదుతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. కోర్టులో సాక్ష్యాల సమర్పణలో సహకరించిన కోర్టు డ్యూటీ అధికారి ఎస్.రాజును మెండోరా ఎస్సై సుహాసిని అభినందించారు.