అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indiramma Housing Scheme | రాష్ట్ర ప్రభుత్వం(State Government) పేదల సొంతింటి కల నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Housing Scheme) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటీవల లబ్ధిదారులను ఎంపిక చేసిన ప్రభుత్వం మంజూరు పత్రాలు కూడా అందచేస్తోంది.
ఈ పథకంలో భాగంగా ఇళ్లు నిర్మించుకునే వారికి విడతల వారీగా రూ.5 లక్షల సాయం అందనుంది. అయితే లబ్ధిదారుల ఎంపికల అక్రమాలు జరిగాయని చాలా గ్రామాల్లో ప్రజలు ఆరోపిస్తున్నారు. అనర్హులకు ఇళ్లు మంజూరు చేశారని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆందోళనలు కూడా చేపడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు రాలేదని వాటర్ ట్యాంక్(Water tank) ఎక్కి నిరసన తెలిపారు.
వరంగల్ జిల్లా(Warangal District) పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాకు చెందిన సుమన్‌కు ఇందిరమ్మ ఇల్లు రాలేదు. దీంతో ఆయన తండాలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. ఇల్లు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడు. స్థానికులు ఆయనను సముదాయించారు.