అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Drunk drive | నగరంలో మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి న్యాయస్థానం ఏడురోజుల జైలుశిక్ష విధించింది. వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి (SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కుమార్‌గల్లీ (Kumargally) వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నగరానికి చెందిన జగడం మల్లేష్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు.
అనంతరం అతడిని కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాత గురువారం స్పెషల్ సెకండ్‌క్లాస్ జడ్జి వద్ద హాజరుపర్చారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి అతడికి ఏడురోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు.
