Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | డయల్ 100ను దుర్వినియోగం చేసిన వ్యక్తికి జైలుశిక్ష

Nizamabad | డయల్ 100ను దుర్వినియోగం చేసిన వ్యక్తికి జైలుశిక్ష

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | అత్యవసర సమయంలో పోలీసులకు ఫోన్​ చేయడానికి ఉన్న డయల్​ 100 (Dial 100)ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. అనవసరంగా ఫోన్​ చేసి సిబ్బందిని విసిగిస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు చేపడుతున్నారు. తాజాగా డయల్ 100ను దుర్వినియోగం చేసిన వ్యక్తికి న్యాయమూర్తి నాలుగు రోజుల జైలు శిక్ష విధించారు.

హైదరాబాద్​ (Hyderabad)లోని కూకట్​పల్లిలో నివాసం ఉండే కేతావత్​ పరశురామ్​ ధర్పల్లి మండలం డీబీ తండాకు తీజ్ పండుగ కోసం వచ్చారు. ఈ నెల 8న మద్యం మత్తులో పలుమార్లు డయల్​ 100కు ఫోన్​ చేశాడు. డయల్​ 100కు అనవసరంగా ఫోన్​ చేసిన పరశురామ్​ను సోమవారం నిజామాబాద్​ (Nizamabad) సెకండ్​ క్లాస్​ మేజిస్ట్రేట్​ నూర్జహాన్​ ఎదుట హాజరు పరిచారు. దీంతో నిందితుడికి న్యాయమూర్తి నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్సై కల్యాణి తెలిపారు. అనవసరంగా డయల్​ 100కు ఫోన్​ చేస్తే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.