Homeజిల్లాలునిజామాబాద్​Drunk drive | మద్యం తాగి వాహనం నడిపిన పలువురికి జైలు

Drunk drive | మద్యం తాగి వాహనం నడిపిన పలువురికి జైలు

- Advertisement -

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Drunk drive | మద్యం తాగి వాహనం నడిపిన ఆరుగురికి జైలు శిక్షతోపాటు మరో 23 మందికి జరిమానా విధించారు.

ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ (ACP Masthan Ali) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఆయా ప్రాంతాల్లో ఇన్​స్పెక్టర్​ పి.ప్రసాద్ (Inspector Prasad)​ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి వారిని 29 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని సెకండ్​ క్లాస్​ మెజిస్ట్రేట్​ నూర్జహాన్ (Second Class Magistrate NoorJahan)​ ఎదుట హాజరుపర్చగా 23 మందికి రూ.30వేల జరిమానా విధించారు. మరో ఆరుగురికి రెండురోజుల జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చిందని ఏసీపీ వివరించారు.

Drunk drive | వన్​టౌన్​ పరిధిలో..

నగరంలోని వన్ టౌన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి న్యాయస్థానం జైలుశిక్ష విధించిందని  ఎస్​హెచ్​వో రఘుపతి (SHO Raghupathi) తెలిపారు. ఆదివారం రాత్రి కుమార్​గల్లీ (Kumar Gally) వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించగా పాములబస్తీకి (Pamulabasthi) చెందిన శివకుమార్ అధికంగా మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. మంగళవారం న్యాయస్థానం ఎదుట హాజరుపర్చగా అతడికి రెండురోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

Drunk drive | మద్యం తాగి వాహనాలు నడపొద్దు..

మద్యం తాగి వాహనాలు నడపొద్దని ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ పేర్కొన్నారు. ఇలా తాగి వాహనాలు నడిపితే.. వారికే కాకుండా ఇతరుకుల కూడా ప్రమాదాలు పొంచి ఉంటాయన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని.. వారు వాహనాలు నడిపితే మైనర్ల తల్లిదండ్రులపై కేసులు పెడతామని ఎస్​హెచ్​వో స్పష్టం చేశారు.

Must Read
Related News