HomeతెలంగాణPeddapalli | కారులో చిక్కుకున్న చిన్నారి.. సెల్​ఫోన్ సాయంతో ప్రాణాలు కాపాడిన యువకుడు

Peddapalli | కారులో చిక్కుకున్న చిన్నారి.. సెల్​ఫోన్ సాయంతో ప్రాణాలు కాపాడిన యువకుడు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Peddapalli | పెద్దపల్లి (Peddapalli) జిల్లా సుల్తానాబాద్‌లో చోటుచేసుకున్న ఒక సంఘటన చిన్న‌దిగా అనిపించినా.. చాలా మందిని ఆందోళనకు గురి చేసింది. ఓ చిన్నారి కారులో ఉండ‌గా, డోర్స్ అన్నీ లాక్ అయిపోవ‌డంతో అంద‌రూ ఉలిక్కిప‌డ్డారు. ఓ యువకుడి చాకచక్యం, సమయస్ఫూర్తి చిన్నారి జీవితాన్ని కాపాడింది. వివ‌రాల‌లోకి వెళితే సుల్తానాబాద్ (Sultanabad) పట్టణంలో నివసించే ఓ కుటుంబం తమ కారులో స్వీట్ షాపునకు వచ్చింది. ఆ కుటుంబం సభ్యులు అందరూ దిగి షాపులోకి వెళ్లారు. అయితే చిన్నారి కారులోనే ఉండిపోగా, అనుకోకుండా కారు డోర్లు ఆటోమేటిక్‌గా లాక్ (Car Door Lock) అయ్యాయి.

Peddapalli | పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది..

మరింత దురదృష్టకర విషయం ఏమిటంటే… కార్ కీస్ (Car Keys) కూడా లోపలే ఉండిపోవడంతో ఆ కుటుంబం భ‌యాందోళ‌న‌కు గురైంది. అధిక ఉష్ణోగ్రత, వాహనంలో గాలి ప్రసరణ లేకపోవడం వల్ల చిన్నారి అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంద‌ని త‌ల్లిదండ్రులు చాలా క‌ల‌వర‌ప‌డ్డారు. ఎంత ప్రయత్నించినా డోర్ ఓపెన్ చేయలేక తల్లిదండ్రులు త‌ల్ల‌డిల్లారు. స్థానికులు కూడా పరిస్థితిని గమనించి భయాందోళన చెందారు. కారు అద్దాలు పగులగొట్టేందుకు సిద్ధమయ్యారు. ఓ యువకుడు అక్కడికి వచ్చి పరిస్థితిని గమనించాడు. ఆ చిన్నారిని రక్షించాలన్న ఉద్దేశంతో వెంటనే తన సెల్‌ఫోన్‌లో ఒక వీడియో సెర్చ్ చేశాడు.

లాక్ అయిన కార్ డోర్‌ను ఎలా ఓపెన్ చేయాలి? అనే వీడియోను యూట్యూబ్‌లో (YouTube) ఓపెన్ చేసి కారులో ఉన్న చిన్నారికి చూపించాడు. ఆ వీడియోలో చూపిన పద్ధతిని అనుసరించి, చిన్నారి డోర్‌ను ఓపెన్ చేయడంలో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ యువకుడిని అంతా అభినందించారు. ఈ సంఘటన మరోసారి తల్లిదండ్రులకు గుణపాఠం కానుంది. చిన్నారులను వాహనాల్లో ఒంటరిగా వదిలిపెట్టకూడదన్న విషయం అందరికీ తెలిసినదే అయినా, కొన్నిసార్లు మ‌రిచిపోవ‌డంతో ఇలాంటి ప్రమాదం తలెత్తొచ్చు. చిన్నారుల విష‌యంలో తల్లిదండ్రులకు ప్ర‌త్యేక అవ‌గాహ‌న ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

Must Read
Related News