ePaper
More
    HomeజాతీయంPlane Crash | ఆ విమానంలో 11ఏ సీటు ఎందుకు అంత‌ ప్రత్యేకం..

    Plane Crash | ఆ విమానంలో 11ఏ సీటు ఎందుకు అంత‌ ప్రత్యేకం..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Plane Crash | అహ్మాదాబాద్ ఎయిర్ పోర్ట్ Ahmadabad Air port సమీపంలో కూలిన ఎయిరిండియా విమానం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

    విమానంలో ప్రయాణిస్తున్న వారితో పాటు అది ఢీకొన్న బిల్డింగ్‌లో ఉన్న మెడికోలు కూడా దుర్మరణం చెందారు. అయితే ఈ ప్ర‌మాదంలో విమానంలోని 11వ నంబర్ సీటులోని 40 ఏళ్ల బ్రిటీష్ పౌరుడు స్వల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. విమానం కూలిపోయిన సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ (Emergency exit) నుంచి ప్రయాణికుడు బయటికొచ్చినట్లు సమాచారం. గాయాలతో ప్రయాణికుడు రోడ్డుమీద నడుస్తూ అంబులెన్స్ వెపుకి వెళ్తున్నట్లున్న వీడియోలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. కాగా ప్రాణాలతో బయటపడిన వ్యక్తి పేరు విశ్వాస్ కుమార్ రమేష్. భారత సంతతికి చెందిన ఈ వ్యక్తి లండన్ లో స్థిరపడ్డారు.

    Plane Crash | మృత్యుంజ‌యుడు..

    గత 20 ఏళ్లుగా విశ్వాస్ కుమార్ అక్కడే భార్యా,పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కుటుంబసభ్యులను కలిసేందుకు భారత్ వచ్చిన విశ్వాస్ కుమార్ Vishwas kumar..తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్ తో కలిసి తిరిగి లండన్ (London) వెళ్లేందుకు గురువారం మధ్యాహ్నాం ఎయిరిండియాకి చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం ఎక్కారు. విమానం కూలిపోయిన సమయంలో అందులో మొత్తం 240 మంది ఉన్నారు. విశ్వాస్ ఒక్కరే బతికి బయటపడ్డారు. విశ్వాస్ కుమార్ ప్ర‌స్తుతం అహ్మదాబాద్ లోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అతని కళ్లు, ఛాతీ, పాదాలకు గాయాలైనట్లు తెలుస్తోంది.

    బ్రిటిష్‌ జాతీయుడైన 38 ఏండ్ల రమేశ్‌ విమానంలో 11ఏ సీటులో కూర్చున్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ డోర్‌ వెనుక ఈ సీటు ఉంటుంది. ఈ సీటు ప్ర‌త్యేక‌త ఏంటంటే..

    ఎయిర్‌ ఇండియా(Air India)కు చెందిన బోయింగ్‌ 787-8(డ్రీమ్‌లైనర్స్‌)లో 11ఏ సీటు ఎకానమీ క్లాస్‌ క్యాబిన్‌కు చెందిన మొదటి వరుసలో ఉంటుంది. బిజినెస్‌ క్లాస్‌కి వెనుక ఉంటుంది. క్యాబిన్‌కి అభిముఖంగా కూర్చుని చూస్తే ఎడమ వైపున 11ఏ సీటు ఉంటుంది. విమానం రెక్కలు ఉండే ప్రదేశానికి రెండు వరుసల ముందు ఈ విండో సీటు ఉంటుంది. ప్రమాద సమయాలలో సురక్షిత సీటుగా పరిగణించే 11ఏ సీటు ఎమర్జెన్సీ డోర్‌(Emergency door)కు వెనుకనే ఉంటుంది.

    అయితే 11ఏ సీటులో కూర్చున్న విశ్వాస్ కుమార్ కు.. విమానం టేకాఫ్ అయిన 30 సెకన్లకే పెద్ద శబ్దం వినబడింది. వెంటనే విమానం కూలిపోయింది. “నేను సృహలోకి వచ్చిచూసేసరికి నా చుట్టూ అన్ని మృతదేహాలు కనిపించాయి. వెంటనే లేచి పరిగెత్తాను. విమానశకలాలు అక్కడక్కడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.” ఎవరో నన్ను అంబులెన్స్ లోకి Ambulance ఎక్కించారని మీడియాతో చెప్పుకొచ్చాడు.

    Latest articles

    Inter student | కొత్త చీర కొనివ్వలేదని.. చీరతోనే ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Inter student : నేటి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అతి కష్టం మీద తమ...

    Dial 100 | మద్యం మత్తులో డయల్​ 100కు కాల్​.. కఠినంగా స్పందించిన పోలీసులు.. నాలుగు రోజుల జైలు శిక్ష

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dial 100 : డయల్​ 100 అంటే.. అత్యవసర పరిస్థితులలో పోలీసులను సంప్రదించేందుకు ఉపయోగించే హెల్ప్‌లైన్...

    US tariffs | అన్యాయం.. అసమంజసం.. అమెరికా సుంకాలను తీవ్రంగా ఖండించిన భారత్

    అక్షరటుడే, న్యూఢిల్లీ: US tariffs : అమెరికా అదనపు సుంకాలు పెంచడాన్ని ఇండియా India తీవ్రంగా ఖండించింది. భారత...

    Helmet | హెల్మెట్​ బదులు పాల క్యాన్​ మూత.. పెట్రోల్​ బంకు​ సీజ్​..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Helmet : మధ్యప్రదేశ్​(Madhya Pradesh)లోని ఇండౌర్​(Indore)లో తాజాగా కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి తీసుకొచ్చారు. ద్విచక్ర...

    More like this