116
అక్షరటుడే, బోధన్: Bodhan Police | ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి చెందారు. ఈ ఘటన బోధన్ మండలం కల్దుర్కి (Kaldurki village) శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంజీర (Manjeera river) నుంచి ఇసుకను తీసుకొస్తున్న ఓ ట్రాక్టర్ కల్దుర్కి శివారులో ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న రాము అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై మచ్చేందర్ (Sub-Inspector Machhender) సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాము మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.