అక్షరటుడే, మెండోరా: Dial 100 | డయల్ 100ను దుర్వినియోగం చేసిన వ్యక్తికి న్యాయస్థానం జైలుశిక్ష విధించింది.
మెండోరా ఎస్సై సుహాసిని (Mendora SI Suhasini) తెలిపిన వివరాల ప్రకారం.. మెండోరా గ్రామానికి చెందిన సందేశ్బాబు అనే వ్యక్తి మద్యం మత్తులో డయల్ 100కు ఫోన్ చేసి పోలీసు సమయాన్ని వృథా చేశాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆర్మూర్ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారించిన సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సందేశ్బాబుకు నాలుగురోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారని ఎస్సై సుహాసిని తెలిపారు.
