అక్షరటుడే, కోటగిరి : Sand Vehicle Service | ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకే ‘మన ఇసుక వాహనం’ సేవలు ప్రారంభిస్తున్నట్లు తహశీల్దార్ గంగాధర్ (Tahsildar Gangadhar) పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన పోతంగల్ మండలంలోని (Pothangal Mandal) హంగర్గాలో సర్పంచ్ ఉదయ్ భాస్కర్‌తో కలిసి ‘మన ఇసుక వాహనం’ ఆన్లైన్ బుకింగ్ సేవలను ప్రారంభించారు.
Sand Vehicle Service | ఇందిరమ్మ ఇళ్ల కోసం..
ఇందిరమ్మ ఇళ్ల (Indiramma House) కోసం 54 ట్రాక్టర్లు ఇసుక బుక్ చేసుకోగా వారికి శుక్రవారం తహశీల్దార్ అనుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మ్యానువల్ విధానానికి స్వస్తి పలికామన్నారు. ఇక నుంచి పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే ఇసుక బుకింగ్ యాప్‌ను వాహనదారులు వినియోగించుకోవాలని సూచించారు. ఇసుక అవసరమైన వారందరూ ఆన్లైన్ బుకింగ్ (Online Booking) యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఇసుకను పొందాలని సూచించారు. కార్యక్రమంలో వాహనదారులు, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.