అక్షరటుడే, ఇందల్వాయి:Indalwai | ఇందలవాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి(Yellareddy Palli) నివాసి గోషికొండ గంగానర్సయ్య(36) కువైట్లో Kuwait labours అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ప్రభుత్వం(Government) మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించేలా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.
