95
అక్షరటుడే, ఇందల్వాయి : Indalwai Mandal | విద్యుత్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఇందల్వాయి పోలీస్ స్టేషన్ (Indalwai police station) పరిధిలోని వెంగలపాడు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన లావుడియ రాజు (30) ఇంట్లో విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఇంట్లో విద్యుత్ సమస్య (electrical problem) తలెత్తడంతో సరి చేస్తుండగా షాక్కు గురై మృతి చెందినట్లు తెలిసింది. మృతుడికి భార్య సునీత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.