అక్షర టుడే, ఇందల్వాయి : Indalwai Mandal | మండలంలోని సిర్నాపల్లి గ్రామానికి(Sirnapalli Village) చెందిన పురేందర్ గౌడ్ (52) అనే వ్యక్తి గన్నారం గ్రామ పరిధిలోని సిద్దుల గుట్ట(Siddulagutta) సమీపంలో రోడ్డు పక్కన జారిపడి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.
స్థానికుల కథనం ప్రకారం.. శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన పురేందర్ గ్రామ సమీపంలో రోడ్డు పక్కన పడి కనిపించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్(SI Sandeep) తెలిపారు.