Homeజిల్లాలుకామారెడ్డిBanswada | మద్యం మత్తులో డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి

Banswada | మద్యం మత్తులో డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | మద్యం మత్తులో డ్రెయినేజీలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బాన్సువాడ మండలంలోని తాడ్కోల్​లో (Tadkol) చోటు చేసుకుంది. సీఐ అశోక్ (CI Ashok)​ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బార్‌లో (Bar) పనిచేసే జిలాని(47)కి మద్యం తాగే అలవాటు ఉంది.

Banswada | బార్​కు వెళ్తున్నానని చెప్పి…

ఈనెల 22న ఇంటి నుంచి బార్‌కు వెళ్తున్నానని చెప్పి తిరిగి రాలేదు. కుటుంబీకులు ఆచూకీ కోసం గాలించినా.. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. సోమవారం డ్రెయినేజీలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మద్యం మత్తులో డ్రెయినేజీలో పడి మృతి చెంది ఉంటాడని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.