Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి

Nizamsagar | చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | చెట్టును టీవీఎస్​ ఎక్సెల్​​ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సుల్తాన్​నగర్​ శివారులో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్ నగర్ (mahammad nagar) మండల కేంద్రానికి చెందిన గని(30) అనే వ్యక్తి పెట్రోల్​ విక్రయిస్తూ జీవిస్తున్నాడు.

సోమవారం ఉదయం నిజాంసాగర్​లోని పెట్రోల్​ పంప్​కు (Petrol pump) వెళ్తుండగా సుల్తాన్​పూర్​ గ్రామ శివారులో కల్లు దుకాణం వద్ద ఎక్సెస్​ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో తలకు బలమైన గాయాలు కాగా గని అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య షహనాజ్​ ఫిర్యాదు మేరకు ఎస్సై శివకుమార్​ కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Must Read
Related News