83
అక్షరటుడే, లింగంపేట: Lingampeta mandal | ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ఒకరు మృతి చెందారు. ఈ ఘటన లింగంపేట మండల కేంద్రంలో (Lingampeta mandal) శుక్రవారం చోటు చేసుకుంది.
ఎస్సై దీపక్‌కుమార్ (Sub-Inspector Deepak Kumar) తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట మండల కేంద్రానికి చెందిన తిదిరి నవీన్ కుమార్(40) టైలరింగ్ చేస్తూ జీవిస్తున్నాడు. అయితే శుక్రవారం ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి మృతి చెందాడు. నవీన్‌కుమార్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.