111
అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad City | ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ (lab technician) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో (Nizamabad city) చోటు చేసుకుంది.
వన్ టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి (SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఖలీల్వాడిలో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న ఓంకార్ (25) వ్యక్తిగత కారణాలతో ఆస్పత్రిలోని బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.