Homeజిల్లాలునిజామాబాద్​Indalwai | రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

Indalwai | రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -

అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | రైలుకింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిర్నాపల్లి, ఇందల్వాయి రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం చోటు చేసుకుంది.

రైల్వే ఎస్సై సాయిరెడ్డి (Railway SI Sai Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. గన్నారం (Gannram) గ్రామానికి చెందిన ఎడ్లరవి (45) సిర్నాపల్లి, ఇందల్వాయి రైల్వేస్టేషన్​ల మధ్య రైతుల కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.