అక్షరటుడే, వెబ్‌డెస్క్: Viral Video | ఇంట్లోని సాధారణ వస్తువులను కాస్త భిన్నంగా వాడే వ్యక్తులను నేటి రోజుల్లో సోషల్ మీడియాలో తరచుగా చూస్తుంటాం. వంట కుక్కర్‌లో బట్టలు ఇస్త్రీ చేయడం, ఐరన్ బాక్స్‌పై కాఫీ వేడి చేయడం, ప్లాస్టిక్ పైపులతో షవర్ సెట్ చేయడం వంటి వినూత్న ప్రయత్నాలు కొందరు చేస్తుంటారు. తాజాగా ఇలాంటి వింత ప్రయత్నం ఒక వీడియోలో వైరల్‌గా మారింది.
Viral Video | వాషింగ్ మిషన్‌లో వేరుశనగ
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి వాషింగ్ మిషిన్‌ను (Washing Machine) వినూత్నంగా వాడాడు. వాషింగ్ మిషన్‌లో బట్టలు కాకుండా వేరుశనగ కాయలను వేసి వాటిని శుభ్రం చేశాడు. సాధారణంగా బకెట్ నీటిలో కడగడం అందరు చేసే పని, కాని ఇప్పుడు వాషింగ్ మిషిన్ ద్వారా క్లీన్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఇందులో వేరుశనగలు (Groundnuts) గిరగిరా తిరగడం వల్ల శుభ్రం అయ్యాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. “వాషింగ్ మిషన్‌ను ఇలా కూడా వాడొచ్చా!”, “ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు” అంటూ వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం 44,000+ లైక్స్ మరియు 5 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని సోషల్ మీడియాలో (Social Media) హల్చల్ చేస్తోంది. ఇలాంటి వినూత్న ప్రయత్నాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటాయి. అలాగే ఇంట్లో సాధారణ వస్తువులను సృజనాత్మకంగా వాడే కొత్త ఆలోచనలకు దోహదం చేస్తాయి. గతంలోనూ ఇలాంటి వీడియోలు నెట్టింట వైరల్ కాగా.. అవి నెటిజన్స్ దృష్టిని ఎంతగానో ఆకర్షించాయి.
View this post on Instagram

