HomeUncategorizedAndhra Pradesh | మ‌హిళా తహసీల్దార్‌పై కొడవలితో దాడి.. నిందితుడు మ‌రెవ‌రో కాదు

Andhra Pradesh | మ‌హిళా తహసీల్దార్‌పై కొడవలితో దాడి.. నిందితుడు మ‌రెవ‌రో కాదు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్‌లోని Andhra Pradesh ఓ జిల్లాలో మహిళా తహసీల్దార్‌పై చోటుచేసుకున్న కొడవలి దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రజాస్వామ్యంలో శాసనబద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఇలా ప్రాణాలకు తెగించే స్థాయిలో దాడి జరగడం మరొకసారి రెవెన్యూ వ్యవస్థలో ఎదురవుతున్న ఒత్తిళ్లు, భద్రతా లోపాలుపై ప్రశ్నలు వేస్తోంది. ఈ దారుణ ఘటన తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లిలోని తహసీల్దార్ కార్యాలయంలో దారుణం జరిగిందివివరాల్లోకి వెళ్తే.. తొత్తరమూడి శివారు జోగిరాజుపాలెంకు చెందిన మీసాల సత్యనారాయణ అనే వ్యక్తి.. శుక్రవారం సాయంత్రం కార్యాలయంలో సిబ్బంది ఉండగానే అయినవిల్లి తహసీల్దార్ కార్యాలయంలోకి హఠాత్తుగా వచ్చాడు.

Andhra Pradesh | Andhra Pradeshకొడ‌వ‌లితో దాడి..

ఆ త‌ర్వ‌త త‌న సంచిలో దాచి ఉంచిన కొడవలిని Sickle తీసి తహసీల్దార్‌పై నాగలక్ష్మమ్మపై విసిరాడు. ఈ దాడిలో తహసీల్దార్(Tahsildar) చేతికి గాయమైంది. ఈ క్రమంలో అక్కడున్న కార్యాలయ సిబ్బంది వెంటనే అప్రమత్తమై దాడిని చేసిన వ్యక్తిని ప‌ట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసుల(police) సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడి చేసిన క్రమంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని సిబ్బంది తెలిపారు. గతంలోనూ ఓ నేర సంఘటనలో అతను జైలుకు వెళ్లి వచ్చాడని స్థానికులు చెబుతున్నారు. తన కొబ్బరితోటలు ఇతరులు ఆక్రమించుకున్నారని, భూపత్రాలు ఇప్పించాలంటూ అమలాపురంలో కలెక్టర్ కార్యాలయం, స్థానిక ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్, పంచాయతీ కార్యాలయాల చుట్టూ అతను తిరుగుతుంటాడని స్థానికులు చెబుతున్నారు

అత‌ను కొన్నాళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, మద్యం సేవించి రహదారిపై కేకలు వేసుకుంటూ వెళ్తుంటాడని గ్రామ‌స్తులు అంటున్నారు. అయితే సత్యనారాయణకు గ్రామంలో ఎటువంటి భూములు, భూసంబంధిత సమస్యలు లేవని తహశీల్దార్ tahsildar నాగలక్ష్మమ్మ చెప్పుకొచ్చారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సత్యనారాయణను అరెస్టు చేశారు. కాగా, తహశీల్దార్‌ను కొత్తపేట ఆర్డీవో శ్రీకర్(Kothapet RDO Srikar) పరామర్శించారు. తహశీల్దార్ పై మారణాయుధంతో దాడి చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మహేశ్(Collector Mahesh Kumar) కుమార్ తెలిపారు. తహశీల్దార్‌ను ఆయన ఫోన్‌లో పరామర్శించారు.ప‌దవిని వహిస్తూ చట్టపరమైన విధులు నిర్వర్తిస్తున్న తహసీల్దార్‌పై ఇలా దాడి జరగడం బాధాకరం.