అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Spying for Pak | దేశంలోని కొంత మంది వ్యక్తులు పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్నారు. డబ్బు కోసం కొందరు, హనీట్రాప్‌కు గురై మరి కొందరు గూఢచార్యానికి పాల్పడుతున్నారు. ఇలాంటి వారిని ఇటీవల భారత నిఘా వర్గాలు అరెస్ట్ చేస్తున్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) అనంతరం పాక్‌కు గూఢచార్యం చేస్తున్న పలువురిని భారత నిఘా వర్గాలు అరెస్ట్ చేశాయి. ప్రత్యేక తనిఖీలు చేపట్టి చాలా మందిని అదుపులోకి తీసుకున్నాయి. తాజాగా మళ్లీ పలువురిని అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. హనీట్రాప్‌లో చిక్కుకొని రాజస్థాన్‌కు చెందిన మంగత్ సింగ్ అనే వ్యక్తి పాక్ మహిళకు భారత రక్షణశాఖ రహస్యాలను పంపించాడు. దీంతో రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులు(Rajasthan Intelligence Officers) ఆయనను అరెస్ట్ చేశారు.
Spying for Pak | మహిళ కోసం..
పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో అధికారులు శుక్రవారం మంగత్ సింగ్‌ని అరెస్టు చేశారు. అల్వార్‌కు చెందిన ఆయనకు రెండేళ్ల క్రితం సోషల్ మీడియాలో పాక్(Pakistan)కు చెందిన ఇషాశర్మతో పరిచయం ఏర్పడింది. ఆమె భారత రక్షణ సమాచారాన్ని అడిగేది. దీంతో మంగత్ సింగ్ సైన్యం, రక్షణ సంస్థలకు చెందిన కీలక సమాచారాన్ని సేకరించి ఆమెకు పంపినట్లు అధికారులు గుర్తించారు. అల్వార్ కంటోన్మెంట్ ఏరియా, ఇతర రక్షణరంగ కేంద్రాలపై పాక్‌కు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.కాగా ఇటీవల రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు చెందిన మహేంద్ర ప్రసాద్‌ను సైతం గూఢచర్యం ఆరోపణలతో అధికారులు అరెస్ట్ చేశారు. డీఆర్‌డీవో గెస్ట్ హౌస్ మేనేజర్‌గా పనిచేసే మహేంద్ర పాకిస్థాన్‌కు కీలక సమాచారం చేరవేసినట్లు అధికారులు గుర్తించారు.