అక్షరటుడే, గాంధారి: Gandhari Mandal | దావత్‌కు పిలిచి దాడికి పాల్పడ్డ వ్యక్తిని గాంధారి పోలీసులు (Gandhari police) అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్సై ఆంజనేయులు (Sub-Inspector Anjaneyulu) వివరాలు వెల్లడించారు.
Gandhari Mandal | ముదెల్లి గ్రామంలో..
గాంధారి మండలంలోని ముదెల్లి గ్రామంలో (Mudelli village) నర్సింలు అనే వ్యక్తి కొత్త బైక్ కొన్నాడు. ఈ మేరకు రంజిత్‌ను దావత్‌కు పిలిచాడు. ఈ క్రమంలో దావత్ చేసుకుంటున్న క్రమంలో మాటామాట పెరిగి ఘర్షణ పడ్డారు. అనంతరం రంజిత్ ఇంటికి వెళ్తున్న క్రమంలో నర్సింలు వెనకాలే వచ్చి తనను దూషించినందుకు కోపంతో గొడ్డలితో దాడి చేశాడు. దీంతో రంజిత్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.
Gandhari Mandal | బాన్సువాడ నుంచి నిజామాబాద్‌కు
తీవ్రంగా గాయపడ్డ రంజిత్‌ను అతడి బంధువులు, గ్రామస్థులు కలిసి మొదట బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి నిజామాబాద్‌లో మనోరమ ఆస్పత్రిలో (Manorama Hospital) చేర్పించారు. అయితే రంజిత్ సోదరుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు నర్సింలతో పాటు అతడిని ప్రోత్సహించిన ముగ్గురుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. అనంతరం నిందితుడు నర్సింలును అదుపులోకి తీసుకుని గొడ్డలిని స్వాధీనం చేసుకున్నామన్నారు. రిమాండ్‌కు సైతం తరలించామని.. అలాగే ఫిర్యాదులో పేర్కొన్నవారిని సైతం అదుపులోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు.