ePaper
More
    HomeతెలంగాణMalnadu Drugs Case | మల్నాడు డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌.. నిందితుడు రాహుల్‌ తేజ్‌పై మరో...

    Malnadu Drugs Case | మల్నాడు డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌.. నిందితుడు రాహుల్‌ తేజ్‌పై మరో డ్రగ్స్‌ కేసు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్​ దందాపై ఈగల్​ టీమ్​ సభ్యులు దాడులు చేసిన విషయం తెలిసిందే. రెస్టారెంట్​ ముసుగులో నడుపుతున్న డ్రగ్స్​ రాకెట్​ గుట్టును ఈగల్​ టీమ్ (Eagle Team)​ రట్టు చేసింది. అయితే ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.

    తాజాగా మల్నాడు డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్‌ నెలకొంది. నిందితుడు రాహుల్‌ తేజ్‌పై మరో డ్రగ్స్‌ కేసు నమోదైంది. 2024లో రాహుల్ తేజ్‌పై డిచ్‌పల్లిలో డ్రగ్స్‌ కేసు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రాహుల్ తేజ్ ఉన్నాడు. కాగా, ట్రాన్సిట్‌ వారెంట్‌పై రాహుల్‌ తేజ్‌ను.. డిచ్‌పల్లి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.

    మరోవైపు.. రెస్టారెంట్​ యజమాని, నిందితుడు సూర్య వెనుక భారీ డ్రగ్ నెట్‌వర్క్ (Huge Drug Network) ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డ్రగ్స్ సరఫరా చేసే నైజీరియన్లతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. నైజీరియన్ డ్రగ్స్ డాన్ స్టాన్లీతో (Nigerian Drugs Don Stanley) కలిసి సూర్య నగరంలో డ్రగ్స్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు.

    Malnadu Drugs Case | కస్టమర్లలో ప్రముఖులు

    నైజీరియన్లతో కలిసి నగరంలో సూర్య (Malnadu Restaurent Owner Surya) మల్నాడు రెస్టారెంట్ వేదికగా డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నాడు. ఆయన దగ్గర 600 మంది కస్టమర్లు డ్రగ్స్​ తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, డాక్టర్లు, జిమ్ నిర్వాహకులు, బడాబాబుల పిల్లలు, పోలీసు అధికారుల పిల్లలు సైతం డ్రగ్స్​ కస్టమర్లుగా ఉన్నట్లు గుర్తించారు. వారికి దశలవారీగా నోటీసులు ఇచ్చి ఈగల్ టీమ్ విచారిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు పోలీసు అధికారుల పిల్లలను సైతం ఈగల్​ టీమ్​ అరెస్ట్​ చేసింది.

    Malnadu Drugs Case | డ్రగ్స్​ పార్టీల నిర్వహణ

    సూర్య కస్టమర్లకు డ్రగ్స్​ సరఫరా చేయడంతో పాటు పలు పబ్​ల యజమానులతో కలిసి డ్రగ్స్​ పార్టీలు (Drugs Parties) నిర్వహించేవాడు. పబ్​లు, నగర శివారులోని రిసార్టులలో పార్టీలు ఏర్పాటు చేసేవాడు. ఇప్పటికే ఈగల్​ టీమ్​ పలు పబ్​ల యజమానులను అరెస్ట్​ చేసింది. ఈ కేసు విచారణ వేగవంతంగా సాగుతోంది.

    Latest articles

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    అక్షర టుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని,...

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    More like this