అక్షరటుడే, వెబ్డెస్క్ : Maoist Leaders Surrender Statement | మావోయిస్టు మాజీ నేత మల్లోజుల వేణుగోపాల్ (Mallojula Venugopal) కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అగ్ర నేతలు దేవ్జీ, రాజిరెడ్డి జనజీవన స్రవంతిలోకి వస్తారని చెప్పారు.
తెలంగాణ (Telangana)కు చెందిన మల్లోజుల వేణుగోపాల్ చారి మావోయిస్ట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. సోను దాదాగా ఆయన కేంద్ర కమిటీలో కీలకంగా వ్యవహరించాయి. కొన్ని రోజుల క్రితం మల్లోజుల లొంగిపోయారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ (Maharashtra CM Fadnavis) ఎదుట ఆయన ఆయుధాలు అప్పగించారు. అయితే మల్లోజులను మావోయిస్ట్ పార్టీ ద్రోహిగా ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా మాట్లాడుతూ.. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అగ్ర నాయకులు దేవ్ జీ, రాజిరెడ్డి జనజీవనంలోకి వస్తారన్నారు. మిగతా వారు కూడా లొంగిపోతారని చెప్పారు.
Maoist Leaders Surrender Statement | డిమాండ్లు పెట్టాం
తాము లొంగిపోయే ముందు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం (Chhattisgarh Government) ముందు డిమాండ్లు పెట్టామని మల్లోజుల తెలిపారు. అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సోనూ దాదాగా ఉద్యమాన్ని వీడినట్లు ప్రకటించారు. తాము సాధించిన విజయాలు ఏంటో అనేది జనాల మధ్యకు వెళ్తే తెలుస్తుందన్నారు. 1980లో ఉన్న తెలంగాణకు, ఇప్పటికి తెలంగాణకు చాలా తేడా ఉందని ఆయన చెప్పారు. నాటి ఉద్యమాన్ని తిరిగి తీసుకు రాలేకపోయని పేర్కొన్నారు.
Maoist Leaders Surrender Statement | మనుగడ లేదు
ప్రస్తుతం మావోయిస్ట్ ఉద్యమానికి మనుగడ లేదని మల్లోజుల తెలిపారు. పార్టీలో ఉన్నవాళ్లంతా వృద్ధులు అయిపోయారని, పార్టీలోకి కొత్త రక్తం రావడం లేదన్నారు. చైనా, రష్యా సిద్ధాంతాలతో ఉద్యమాన్ని ముందుకు నడపలేమన్నారు. తనను ద్రోహి అంటున్న వాళ్లకు కాలమే సమాధానం చెబుతుందన్నారు. తెలంగాణకు త్వరలో వస్తానని ఆయన పేర్కొన్నారు.