HomeతెలంగాణKharge Meeting | స్థానిక పోరుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్​.. కాసేపట్లో రాష్ట్రానికి ఖర్గే

Kharge Meeting | స్థానిక పోరుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్​.. కాసేపట్లో రాష్ట్రానికి ఖర్గే

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kharge Meeting | రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికల నగారా మోగనుంది.

సెప్టెంబర్​ 30 లోపు పంచాయతీ ఎన్నికలు (panchayat elections) నిర్వహించాలని ఇటీవల హైకోర్టు (High court) ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఆయా రాజకీయ పార్టీలు స్థానిక సమరానికి సన్నద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే (Congress national president Mallikarjun Kharge) గురువారం హైదరాబాద్​ రానున్నారు.

Kharge Meeting | ఎల్బీ స్టేడియంలో భారీ సభ

మల్లికార్జున ఖర్గే గురువారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు (Shamshabad airport) చేరుకుంటారు. ఆయన శుక్రవారం ఉదయం గాంధీభవన్‌లో పీఏసీ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అడ్వైజరీ కమిటీతో భేటీ నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో (LB Stadium) గ్రామ, మండల కమిటీ అధ్యక్షులతో నిర్వహించే సభలో పాల్గొని మాట్లాడుతారు.

Kharge Meeting | పక్కాగా ఏర్పాట్లు

మల్లికార్జున్​ ఖర్గే (Mallikarjun Kharge) నగరంలో పర్యటించనుండటంతో కాంగ్రెస్​ పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న సభ ఏర్పాట్లను బుధవారం కాంగ్రెస్​ రాష్ట్ర ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), పీసీసీ అధ్యక్షుడు మహేశ్​గౌడ్​ (Mahesh kumar Goud) పరిశీలించారు. ఖర్గే సభను విజయవంతం చేయాలని ఇప్పటికే రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.