అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించే దమ్మున్న నాయకుడు మల్లన్న అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (Telangana Rajyaadhikara Party) రాష్ట్ర కార్యదర్శి ఆకుల హన్మాండ్లు అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి జిల్లా (Kamareddy district) కన్వీనర్, కో కన్వీనర్ నియామకం కోసం దరఖాస్తులు స్వీకరించామని, శనివారం రాష్ట్ర కమిటీతో చర్చించి నియామకం చేపడుతుందన్నారు.
కన్వీనర్, కో కన్వీనర్లు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేలా పని చేయాల్సి ఉంటుందన్నారు. రాజ్యాధికార పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని, అధికారంలోకి వస్తే బీసీలకు రూ.లక్ష కోట్లు కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా.. కొత్త పార్టీలకు ప్రజలు అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ నిజామాబాద్ పట్టణ (Nizamabad town) అధ్యక్షుడు దొంతుల సందీప్, నాయకులు షేక్ ఖాసీం ఖాద్రి, నవీన్ ముదిరాజ్, టెడ్డు రవి పాల్గొన్నారు.

