అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Helmet Bank | బైక్‌పై వెళ్లేటప్పుడు హెల్మెట్ లేకపోతే పోలీసులు ఫైన్ వేస్తారు. ఇక్కడ మాత్రం అలా కాదు. ఉచితంగా హెల్మెట్ అందిస్తారు. కొత్త హెల్మెట్ కొన్న తర్వాత దానిని తిరిగి తీసుకుంటారు.
దేశంలో రోడ్డు ప్రమాదాల్లో నిత్యం ఎంతో మంది చనిపోతున్నారు. దీంతో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు (Traffic Rules) పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. అయినా కూడా పలువురు నిబంధనలు పాటించడం లేదు. బైక్‌పై వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం లేదు. దీంతో మల్కాజ్‌గిరి ట్రాఫిక్ డీసీపీ (Malkajgiri Traffic DCP) ఆధ్వర్యంలో “హెల్మెట్ బ్యాంక్”లు ఏర్పాటు చేశారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించే రైడర్లు తమ ప్రాథమిక వివరాలను సమర్పించడం ద్వారా అక్కడికక్కడే ఉచితంగా హెల్మెట్ తీసుకునే అవకాశం ఉంది.
Helmet Bank | 24 గంటల్లోపు..
కొత్త హెల్మెట్ కొనుగోలు చేసిన 24 గంటల్లోపు వారు హెల్మెట్‌ను తిరిగి ఇవ్వాలి. రైడర్ ప్రాణాలను రక్షించడం, శిక్షా చర్యలపై మాత్రమే దృష్టి పెట్టకుండా బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ప్రవర్తనను ప్రోత్సహించడం దీని లక్ష్యం. గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ (Gopalapuram Traffic Police Station) పరిధిలోని సంగీత్ చౌరస్తాతో సహా మల్కాజ్‌గిరి జోన్ అంతటా ఉన్న కీలకమైన ట్రాఫిక్ జంక్షన్లలో హెల్మెట్ బ్యాంక్‌లను ఏర్పాటు చేశారు. బైక్ యాక్సిడెంట్లలో హెల్మెట్ లేకపోవడంతోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో వాహనదారుల ప్రాణాలు కాపాడమే లక్ష్యంగా హెల్మెట్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇది తెలంగాణ పోలీసులు నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ (Arrive Alive) రోడ్డు భద్రతా ప్రచారాన్ని కూడా బలోపేతం చేస్తుంది. అంతేగాకుండా ప్రజల్లో సైతం మార్పు వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు.
