అక్షరటుడే, ఇందూరు : Malkai Mahender BJP | కార్పొరేటర్‌గా గెలిపిస్తే 28వ డివిజన్ అభివృద్ధి బాధ్యత తీసుకుంటానని బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి (BJP Corporator Candidate) మల్కాయి మహేందర్ అన్నారు. ఈ మేరకు ఆయా కాలనీల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.
Malkai Mahender BJP | అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా..
ఒకసారి తనకు కార్పొరేటర్‌గా అవకాశం ఇస్తే ఆయా కాలనీల్లో గణనీయమైన మార్పులు తీసుకొస్తానని మల్కాయ్ మహేందర్ అన్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు లేక చాలా కాలనీల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. వాటిని తప్పనిసరిగా పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కాలనీల్లో ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఆయన ముందుకు కదిలారు.
మన ఇందూరు–మన మేయర్..
నిజామాబాద్ (Nizamabad) అర్బన్‌లో మన ఇందూరు మన మేయర్ నినాదంతో ముందుకు వెళ్తున్నామని ప్రతిఒక్కరూ బీజేపీకి (BJP) ఓటు వేసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుందామని అన్నారు. ఎంపీ ఎమ్మెల్యే సహకారంతో డివిజన్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు (BJP Leaders), కార్యకర్తలు పాల్గొన్నారు.