అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Malayalam Actress | ప్రముఖ మలయాళ నటి నవ్యా నాయర్‌కి మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఓనం వేడుకల సందర్భంగా మల్లెపూలను తీసుకెళ్లిన ఆమెకు అక్కడి బయో సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించినందుకు భారీ జరిమానా విధించారు.
మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టు(Melbourne Airport) అధికారులు ఆమెపై రూ.1.14 లక్షలు (దాదాపు AUD 1980) జరిమానా విధించగా, నవ్యా ఏం చేయలేక చెల్లించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని తాజాగా ఓ ఈవెంట్‌లో పంచుకుంది నవ్యా. తనపై పడిన జరిమానా అనుభవాన్ని వివరిస్తూ.. నా తండ్రి కోచ్చి నుంచి బయలుదేరేముందు నాకు మల్లెపూలు(Jasmine) తీసుకొచ్చి ఇచ్చారు. సింగపూర్ మీదుగా మెల్‌బోర్న్ వెళ్తున్నా కాబట్టి కొన్ని తలలో పెట్టుకున్నాను.
Malayalam Actress | ఎంత పని చేశావ్..
మిగిలినవి బ్యాగులో ఉంచాను. కానీ మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులో అధికారులు వాటిని గుర్తించి, నన్ను అడిగి జరిమానా విధించారు. నాకది పూర్తిగా తెలియకపోవడం వల్లే ఇలా జరిగింది. అని చెప్పింది. ఆస్ట్రేలియా(Australia) ప్రపంచంలోనే అత్యంత కఠినమైన బయో సెక్యూరిటీ చట్టాలను పాటించే దేశంగా పేరొందింది. పూలు, విత్తనాలు, పండ్లు, తినుబండారాలు వంటి ప్రకృతి ఉత్పత్తులను ప్రయాణికులు తమతో తీసుకెళ్లడం వలన జీవాణువులు, తెగుళ్లు, వ్యాధులు దేశంలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. అందుకే ఈ రూల్స్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వచ్చాయి. కొందరు నవ్యా నాయర్‌పై సానుభూతి వ్యక్తం చేస్తే, మరికొందరు “చట్టాలపై అవగాహన లేకపోవడం బాధాకరం” అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి, చిన్న చిన్న విషయాల్లోనైనా అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలు తెలిసే అవసరం ఎంతగానో ఉందన్న విషయాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది. కాగా, తిరువోణం పండుగ సందర్భంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన ఓనం వేడుకల్లో పాల్గొనేందుకు మలయాళ నటి నవ్య నాయర్ వెళ్లింది. ఆ సమయంలో ఆమె దగ్గర 15 సెంటీ మీటర్ల మల్లెపూల దండ ఉంది. తన తండ్రి ఎంతో ప్రేమగా కొనివ్వడం వల్లే ఈ మల్లెపూలు తన వెంట తీసుకెళ్లినట్టు నవ్య చెప్పుకొచ్చింది. అయితే చేసిన తప్పుకు జరిమానా చెల్లించాల్సిందేనని అధికారులు పట్టుబట్టడంతో నవ్య నాయర్ అధికారులు చెప్పిన మొత్తాన్ని చెల్లించి అక్కడి నుంచి జారుకున్నారు.