Homeజిల్లాలునిజామాబాద్​Aloor Mandal | ఆలూర్‌లో మాలమహానాడు నాయకుల సమావేశం

Aloor Mandal | ఆలూర్‌లో మాలమహానాడు నాయకుల సమావేశం

ఆలూర్‌లో మాలమహానాడు నాయకులు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 12న నిర్వహించనున్న సమావేశాన్ని విజయంతం చేయాలని కోరారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Aloor Mandal | ఆలూర్‌ మండల కేంద్రంలో (Aloor Mandal Center) మాలమహానాడు మండలాధ్యక్షుడు అగ్గు క్రాంతి ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్​లోని శ్రీరామగార్డెన్‌లో ఈనెల 12న ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ (SC classification), రోస్టర్‌ పాయింట్లలో మాల వర్గం ఎదుర్కొంటున్న అన్యాయాలు వంటి అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా అగ్గు క్రాంతి మాట్లాడుతూ.. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి వివేక్ వెంకటస్వామి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ (Vardhannapet MLA KR Nagaraj) హాజరుకానున్నారని తెలిపారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణలో మాలలకు జరిగిన అన్యాయం, రోస్టర్ పాయింట్లలో అనుసరించాల్సిన న్యాయ విధానంపై అవగాహన కల్పించడమే ఈ మీటింగ్ ఉద్దేశమని చెప్పారు.

అదే విధంగా గ్రూప్–1లో ఉద్యోగాలు సాధించిన మాల వర్గానికి చెందిన అభ్యర్థులను సన్మానించనున్నట్లు క్రాంతి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మాలమహానాడు జాయింట్ సెక్రెటరీ పెండ ఉదయ్, ఆలూర్ సెక్రెటరీ చిట్టిబాబు, కోశాధికారి పిట్ల శోభన్, శ్రీనివాస్, గంగాధర్, సజన్, మహిపాల్, రణధీర్ తదితరులు పాల్గొన్నారు.