More
    Homeలైఫ్​స్టైల్​Healthy Food | మఖానా.. పోషకాల ఖజానా.. మోదీ ఆరోగ్య రహస్యమిదేనా?

    Healthy Food | మఖానా.. పోషకాల ఖజానా.. మోదీ ఆరోగ్య రహస్యమిదేనా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Healthy Food | పూల్‌ మఖానా(Phool makhana).. ఫాక్స్‌నట్‌(Foxnut).. తామర గింజలు.. పేరు ఏదయితేనేం ఇది ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.. ఈ మఖానాలు ఎక్కువగా బిహార్‌(Bihar) రాష్ట్రంలో లభిస్తాయి. దేశ అవసరాలలో సుమారు 80 శాతం ఇక్కడినుంచే సరఫరా అవుతాయి. వీటికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌(Demand)ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం(Central government) ఇటీవల బడ్జెట్‌లో ప్రత్యేకంగా మఖానా బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఎన్నో పోషక విలువలున్న ఈ విత్తనాలను తాను దాదాపు రోజూ తీసుకుంటానని ఇటీవల ప్రధాని మోదీ(Prime minister Modi) సైతం చెప్పారు. ఇది ఒక సూపర్‌ ఫుడ్‌ అని, సంవత్సరంలో కనీసం 300 రోజులు మఖానా తింటానని పేర్కొన్నారు. దీంతో ఈ విత్తనాలకు మరింత క్రేజ్‌ ఏర్పడింది. ఈ సూపర్‌ ఫుడ్‌(Super food)లోని పోషక గుణాలు, వీటిని తీసుకోవడం వల్ల కలిగే లాభాలను ప్రముఖ డైటీషియన్‌ వెన్నెల శివాని వివరించారు. అవేమిటో తెలుసుకుని మనమూ తినేద్దామా..

    Healthy Food | వంద గ్రాముల మఖానాలో ఉండే పోషకాలు..

    • శక్తి 347 కేలరీలు
    • పిండిపదార్థాలు 77 గ్రాములు
    • కొవ్వు 0.1 గ్రాములు
    • ప్రొటీన్లు 9.7 గ్రాములు
    • పీచుపదార్థం 14.5 గ్రాములు
    • ఐరన్‌ 1.4 మిల్లీ గ్రాములు
    • కాల్షియం 60 మిల్లీ గ్రాములు
    • పాస్పరస్‌ 90 మిల్లీ గ్రాములు
    • పొటాషియం 500 మిల్లీ గ్రాములు

    Healthy Food | మఖానా తీసుకోవడం వల్ల ప్రయోజనాలు..

    • తామర గింజలలో ఉండే ఫైబర్‌(Fiber) ఆకలిని అదుపులో ఉంచుతుంది. ఉదరంలో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. వీటిని రోజూ తీసుకుంటే మలబద్ధకం, ఉదర సంబంధ వ్యాధులు తగ్గే అవకాశాలుంటాయి.
    • ఫ్యాట్స్‌ చాలా తక్కువ కాబట్టి ఊబకాయం(Obesity) వస్తుందనే భయం లేదు. బరువు తగ్గాలనుకునేవారు ఈ విత్తనాలను రోజూ తీసుకోవాలి.
    • రక్తాన్ని శుద్ధి చేసే డిటాక్సిఫయింగ్‌ ఏజెంట్స్‌ ఉంటాయి. అవి శరీరంలోని మలినాలను బయటికి పంపిస్తాయి. ఇందులో యాంటీ ఏజింగ్‌ గుణాలుంటాయి. అమినో యాసిడ్స్‌ చర్మంపై ముడతలను, ముఖంపై మొటిమలను తగ్గిస్తాయి. చర్మానికి నిగారింపును తెస్తాయి.
    • ఇందులో ఉండే మెగ్నిషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరాయిడ్స్‌ను అదుపులో ఉంచుతుంది.
    • అధిక పొటాషియం(Potassium), తక్కువ సోడియం కారణంగా రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారికి మేలు జరుగుతుంది.
    • వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహానికి అడ్డుకట్ట వేస్తాయి. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను నియంత్రిస్తాయి. క్యాన్సర్‌కు వ్యతిరేకంగానూ పోరాడతాయి.
    • ఇందులోని అధిక కాల్షియం(Calcium)తో ఎముకలు, దంతాలు బలంగా మారతాయి.
    • యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన మఖానా.. కిడ్నీ వాపు, నొప్పి సమస్యలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారు రోజూ తీసుకుంటే మంచిది.

    More like this

    Banswada | బైక్, డీసీఎం ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | బైక్​ను డీసీఎం ఢీకొనగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన నస్రుల్లాబాద్​లోని (Nasrullabad) నిజాంసాగర్​...

    Vishwakarma Jayanti | ఘనంగా విశ్వకర్మ జయంతి

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Vishwakarma Jayanti | అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ ఆధ్వర్యంలో బుధవారం విశ్వకర జయంతిని...

    Asia Cup | కొన‌సాగుతున్న షేక్ హ్యాండ్ వివాదం.. అలా చేస్తే పాకిస్తాన్‌కి రూ.400 కోట్ల పైన న‌ష్టం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | ఆసియా కప్‌ 2025లో భారత్ vs పాక్ మధ్య జరిగిన...