అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Viral Video | ప్రస్తుత టెక్నాలజీ యుగంలో విచిత్ర ఆవిష్కరణలకు కొదవే లేదు. సైకిల్‌ను బైకులా, ఆటోను కారులా మార్చిన సంఘటనలు మనం చూసే ఉంటాం. ఇప్పుడు అలాంటి వినూత్న ఐడియాతో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ మేకప్ స్టోర్‌లో వరుసగా ఐఫోన్లు ఉంచి కనిపించాయి. దాంతో అక్కడికి వెళ్లిన వారు ఆశ్చర్యపోయారు. “మేకప్ షాప్‌లో ఐఫోన్లు అమ్ముతున్నారా?” అని అనుకుంటూ దగ్గరగా చూశారు. కానీ అసలు ట్విస్ట్ తర్వాత బయటపడింది. ఆ ఐఫోన్ కేసింగ్‌లో నిజానికి ఫోన్ ఏదీ లేదు.. లోపల మొత్తం మేకప్ కిట్ (Make up Kit)! పలు రంగుల మేకప్ షేడ్స్, చిన్న చిన్న బ్రష్‌లు అందులో అమర్చబడ్డాయి.
Viral Video | ఫోన్ అని పొరపాటు పడేరు..
బయటికి పూర్తిగా ఐఫోన్ డిజైన్‌లో (I Phone Design) ఉన్న ఈ మేకప్ బాక్స్ అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా, ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఐఫోన్ 17 దొరక్కపోతే ఇదే సరిపోతుంది” అని ఒకరు, “నా గర్ల్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్‌గా ఇదే ఇస్తా” అని ఇంకొకరు, ఇది ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే వచ్చే ఐఫోన్‌లా ఉంది అని మరొకరు, చైనా పీస్ అనుకున్నా.. మేకప్ పీస్ అని తేలింది అంటూ నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేశారు. ఇక కొందరు ‘ఇది భారతదేశం.. ఇక్కడ ఏదైనా సాధ్యం’ అంటూ జోకులు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో 89 వేలకుపైగా వ్యూస్, 1300కుపైగా లైక్స్ సాధించింది.
ఈ రోజుల్లో జనాల క్రియేటివిటీ చాలా ఎక్కువైంది. ఏదైనా వస్తువు పాడైనా దానిని పడేయడం లేదు. ఆ వస్తువుని ఏదో రకంగా వాడాలని ప్లాన్స్ వేస్తున్నారు. ఈ క్రమంలో క్రియేటివిటీ కూడా ఎక్కువవుతోంది. జనాలను ఆకర్షించే ప్రయత్నంలో కొత్త కొత్త ఆలోచనలతో డిఫరెంట్ మోడల్స్ మార్కెట్స్‌లో లభ్యమవుతున్నాయి. ఒక్కోసారి కస్టమర్స్ వాటిని చూసి అవాక్కవుతున్నారు. ఈ క్రమంలోనే ఫోన్ మాదిరిగా ఉన్న మేకప్ కిట్ అందరు ఆశ్చర్యపోయేలా చేసింది.
iPhone 17 looking Makeup Kit 🤯💀 pic.twitter.com/nhpjdWrFIs
— Jeet (@JeetN25) September 10, 2025