అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | మండలంలో ఈనెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day) సక్సెస్ చేయాలని యునానీ మెడికల్ ఆఫీసర్ (Unani Medical Officer) నాథ కోరారు. శుక్రవారం నిజాంసాగర్ జీపీ కార్యాలయం ఆవరణలో యోగా ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. 21న జరిగే ర్యాలీలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో యోగా ఇన్స్ట్రక్టర్లు అరుణ బీర్ సింగ్, జీపీ కార్యదర్శి భీమ్రావు, గ్రామ పెద్దలు మేకల నరేష్ కుమార్, అనీష్ పటేల్, గాండ్ల రమేష్, రాము రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
