అక్షరటుడే, వెబ్‌డెస్క్:Strike | కేంద్ర ప్రభుత్వం(Central Government) అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మె(Strike)ను జయప్రదం చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్(Telangana Medical Contract Employees), వర్కర్స్ యూనియన్ నాయకులు(Workers Union leaders) పిలుపునిచ్చారు. యూనియన్ గౌరవాధ్యక్షుడు వై ఓమయ్య, జిల్లా అధ్యక్షుడు పి సుధాకర్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ నాగరాజ్, వైస్ ప్రిన్సిపాల్ జలగం తిరుపతిరావు(Jalagam Tirupati Rao)కు శనివారం వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 29 కార్మిక చట్టాలు, నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు డిమాండ్‌తో ఈనెల 20న సమ్మె చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీTelangana Medical Contract Employees జిల్లా ఉపాధ్యక్షుడు హన్మాండ్లు, కవిత పాల్గొన్నారు.