అక్షర టుడే, గాంధారి: Gandhari | పోడు పట్టాలకు రుణాల కోసం బుధవారం చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు మోతిరామ్ నాయక్ (District President Mothiram Nayak) పిలుపునిచ్చారు.
సోమవారం మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ బ్యాంకు మేనేజర్లు (Bank Managers) పోడు పట్టాలకు రుణాలివ్వడం లేదని అన్నారు. ఈ మేరకు గిరిజనులతో కలిసి గాంధారి మండలకేంద్రంలోని (Gandhari Mandal Center) నెహ్రూ చౌరస్తాలో మహాధర్నా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.