అక్షరటుడే, ఇందూరు : Panchayat Elections | సర్పంచ్ ఎన్నికల్లో (Sarpanch Elections) బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు. నిజామాబాద్ (Nizamabad) మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి అంటే కేవలం పనులు ప్రారంభించడమే మాత్రమే కాదని, ప్రజల అవసరాలను అర్థం చేసుకొని సమయానికి అమలు చేయడం అన్నారు.
Panchayat Elections | పనిచేసే వారినే గెలిపించాలి..
సర్పంచ్‌గా ప్రజలతో అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధి పట్ల అంకితభావంతో పనిచేసే నాయకత్వం అవసరమని ఎమ్మెల్యే (MLA Dhanpal) పేర్కొన్నారు. గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం (Central Government) అమలు చేస్తున్న రైతు వేదికలు, రేషన్ బియ్యం, శ్మశానవాటికలు, ఇంకుడు గుంతలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలను పారదర్శకంగా నడిపిపించాలంటే సమర్ధుడైన నాయకుడితోనే సాధ్యమన్నారు. అలాగే నర్సరీలు, మరుగుదొడ్ల నిర్మాణాలు, శుద్ధినీరు, రహదారులు, వెలుగులు, పరిశుభ్రత మొదలైన సంక్షేమ పథకాలను బీజేపీ మద్దతుదారులైన సర్పంచ్ అభ్యర్థులే చేయగలుగుతారని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, కృష్ణ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.