Homeజిల్లాలునిజామాబాద్​BC Reservations | బీసీ బంద్​ను విజయవంతం చేయండి

BC Reservations | బీసీ బంద్​ను విజయవంతం చేయండి

బీసీ రిజర్వేషన్లపై స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ తలపెట్టిన బీసీ బంద్​ను విజయవంతం చేయాలని బీసీ జాయింట్​ యాక్షన్​ కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం కమిటీ సభ్యులు పోస్టర్లు విడుదల ​ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: BC Reservations | బీసీల హక్కుల కోసం ఈనెల 18న బీసీ బంద్​ నిర్వహిస్తున్నట్లు జిల్లా జేఏసీ (BC Action Committee) ఛైర్మన్ లక్ష్మీనారాయణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని గీతా భవన్​లో (Geetha Bhavan) మంగళవారం వాల్​పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలన్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే రాజకీయాలను సహించబోమన్నారు. ఈసారి ప్రజలతో కలిసి ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు, ఆటో క్యాబ్ యూనియన్లు (Auto cab union), కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాలని కోరారు.

బీసీ బంద్ కేవలం నిరసన కాదని, ఇది బీసీల గౌరవం, హక్కు, హోదా కోసం ప్రారంభమైన ఉద్యమం అన్నారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ బొబ్బిలి నర్సయ్య, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగరాజ్, కో–కన్వీనర్ మాస్టర్ శంకర్, అంబదాసరావు, వినోద్, ఎనుగందుల మురళి, ప్రతాప్, ఆమందు విజయ్ కృష్ణ, చింతకాయల రాజు, బొట్టు వెంకటేష్, ఇందల్వాయి కిషన్ తదితరులు పాల్గొన్నారు.