అక్షరటుడే, ఆర్మూర్ : PDSU Nizamabad | కామారెడ్డి పట్టణంలో నిర్వహించనున్న పీడీఎస్యూ నిజామాబాద్, కామారెడ్డి సంయుక్త జిల్లాల కమిటీ మహాసభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఏరియా అధ్యక్షుడు డి.నిఖిల్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కామారెడ్డి (Kamareddy)లో త్వరలో జరిగే ఈ మహాసభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్య వ్యతిరేక విధానాలను ఎండగడుతూ విద్యార్థులను చైతన్యం చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య (Former MLA Gummadi Narsayya), రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ప్రభాకర్, రాష్ట్ర నాయకులు రామకృష్ణ, నాయకులు పృథ్వి, అనిల్ హాజరు కానున్నట్లు తెలిపారు.
PDSU Nizamabad | జిల్లా ఉపాధ్యక్షుడిని బహిష్కరించాం
పీడీఎస్యూ (PDSU) జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్ను సంఘం నుంచి బహిష్కరించినట్లు వారు తెలిపారు. ఇక నుంచి అనిల్ కుమార్కు పీడీఎస్యూకు ఎలాంటి సంబంధం లేదని తెలియజేశారు. విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు దృష్టిలో ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు వివేక్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.