అక్షరటుడే, ఎల్లారెడ్డి : Pocharam Project | పోచారం ప్రాజెక్ట్ నుండి ప్రధాన కాలువలోకి 150 క్యూసెక్కుల నీటిని బుధవారం అధికారులు, ప్రజాప్రతినిధులు విడుదల చేశారు. ఎల్లారెడ్డి (Yellareddy), నాగిరెడ్డిపేట మండలాల్లో సాగుచేస్తున్న 12వేల ఎకరాల పంటల కోసం పోచారం ప్రాజెక్ట్ (Pocharam Project) నుండి ఈ నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 17 అడుగుల నీరు నిల్వ ఉంది. దీంతో ఏ– జోన్ ఆయకట్టుకు చెందిన 6,400 ఎకరాలకు, బీ జోన్లో 6000 ఎకరాలకు నీటిని విడుదల చేశారు. 15 రోజులు నీటిని అందించి 10 రోజులు నీటిని నిలుపుదల చేస్తూ 5 విడతల్లో పంటల సాగుకు నీటిని అందించనున్నారు.
విడుదలైన నీటిని రైతులు (Farmers) సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో పార్థ సింహారెడ్డి, నీటిపారుదల ఎస్ఈ మల్లేష్ సూచించారు. కార్యక్రమంలో డీఈ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ రజిత వెంకటరామిరెడ్డి, శ్రీధర్ గౌడ్, రామచందర్ రెడ్డి, వాసు తదితరులు పాల్గొన్నారు.