అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bihar.. Car-truck collision : బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కతిహార్ జిల్లాలోని పోతియా సమీపంలో కారు, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. బాధితులు పెళ్లి నుంచి సోమవారం అర్ధరాత్రి తిరిగి వస్తుండగా సమేలి బ్లాక్ ఆఫీస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు సుపాల్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు.
“సమేలి బ్లాక్ ఆఫీస్ సమీపంలోని NH-31పై ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను SUV ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మరణించిన వారిలో అందరూ మగవారే ఉన్నారు” అని కతిహార్ ఎస్పీ వైభవ్ శర్మ వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది.