అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్(Domestic Stock Market) ప్రతికూలతలను అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమం వరుసగా మూడో సెషన్లోనూ లాభాలతో ముగిసింది. ఈ క్రమంలో మూడు సెషన్లలో కలిపి సెన్సెక్స్ 1,500 పాయింట్లకుపైగా పెరగ్గా.. నిఫ్టీ 400 పాయింట్లకుపైగా పెరిగింది.
నిఫ్టీ మరోసారి 25 వేల మార్క్‌ను దాటింది. సోమవారం ఉదయం సెన్సెక్స్ 67 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. స్థిరంగా పెరిగాయి. సెన్సెక్స్(Sensex) 81,155 నుంచి 81,846 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 24,881 నుంచి 25,095 పాయింట్ల మధ్యలో సాగాయి. చివరికి సెన్సెక్స్ 582 పాయింట్ల లాభంతో 81,790 వద్ద, నిఫ్టీ(Nifty) 183 పాయింట్ల లాభంతో 25,077 వద్ద స్థిరపడ్డాయి.
ఇటీవలి కాలంలో ట్రంప్ సుంకాలు, హెచ్ 1బీ వీసాలు వంటి కారణాలతో మార్కెట్ కరెక్షన్కు గురయ్యింది. ఆర్బీఐ(RBI) ఇచ్చిన బూస్ట్‌తో మార్కెట్లు కోలుకున్నాయి. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో ప్రధాన సూచీలు లాభాల బాటలో సాగుతున్నాయి.
ఐటీ, బ్యాంకింగ్, హెల్త్‌కేర్ సెక్టార్లలో జోరు..
ఐటీ, బ్యాంకింగ్(Banking), హెల్త్‌కేర్ రంగాల షేర్లు దూసుకుపోగా.. మెటల్ సెక్టార్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. బీఎస్ఈలో ఐటీ ఇండెక్స్(IT index) 2.21 శాతం, బ్యాంకెక్స్ 1.10 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 1.05 శాతం, ఆయిల్ అండÊ గ్యాస్ 0.98 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.93 శాతం, రియాలిటి ఇండెక్స్ 0.64 శాతం పెరిగాయి. మెటల్(Metal) సూచీ 0.92 శాతం, కమోడిటీ 0.37 శాతం, యుటిలిటీ 0.35 శాతం, ఇన్ఫ్రా 0.22 శాతం, ఎఫ్ఎంసీజీ 0.19 శాతం నష్టపోయాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.68 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.64 శాతం లాభపడగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.20 శాతం నష్టపోయింది.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,827 కంపెనీలు లాభపడగా 2,453 స్టాక్స్ నష్టపోయాయి. 169 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 201 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 117 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 11 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 20 కంపెనీలు లాభాలతో ఉండగా.. 10 కంపెనీలు నష్టాలతో ముగిశాయి.టీసీఎస్ 2.96 శాతం, టెక్ మహీంద్రా 2.62 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.61 శాతం, ఎటర్నల్ 2.01 శాతం, ఇన్ఫోసిస్ 1.98 శాతం పెరిగాయి.
Top Losers : టాటా స్టీల్ 1.88 శాతం, అదానీ పోర్ట్స్ 1.23 శాతం, పవర్‌గ్రిడ్ 1.07 శాతం, టైటాన్ 0.97 శాతం, ట్రెంట్ 0.91 శాతం నష్టపోయాయి.