అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | భారత్‌పై టారిఫ్‌లు తగ్గించబోమన్న ట్రంప్ ప్రకటనతోపాటు జీఎస్‌టీ(GST) హేతుబద్ధీకరణపై సమావేశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic Stock Markets) ఒత్తిడికి లోనవుతూ స్వల్ప లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ 138 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. అక్కడినుంచి 291 పాయింట్లు పడిపోయినా తేరుకుని 313 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ(Nifty) 37 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమై.. వెంటనే 83 పాయింట్లు క్షీణించింది. ఇంట్రాడే కనిష్టాలనుంచి 97 పాయింట్లు లాభపడిరది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 23 పాయింట్ల లాభంతో 80,181 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 24,596 వద్ద కొనసాగుతున్నాయి.
Stock Market | మిక్స్‌డ్‌గా సూచీలు..
మెటల్ షేర్లు రాణిస్తున్నా ప్రధాన సూచీలను ఐటీ షేర్లు కిందికిపడేస్తున్నాయి. బీఎస్‌ఈ(BSE)లో ఐటీ ఇండెక్స్ 1.07 శాతం, టెలికాం సూచీ 0.80 శాతం నష్టంతో సాగుతున్నాయి. మెటల్(Metal index) 1.75 శాతం, కమోడిటీ 1.13 శాతం, హెల్త్‌కేర్ 0.7 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.60 శాతం, పీఎస్‌యూ 0.52 శాతం, ఆయిల్ అండ్‌గ్యాస్ ఇండెక్స్ 0.43 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 0.41 శాతం పెరిగాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.80 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.19 శాతం, లార్జ్‌క్యాప్ ఇండెక్స్ 0.06 శాతం లాభంతో ఉన్నాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 18 కంపెనీలు లాభాలతో ఉండగా.. 12 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. టాటా స్టీల్ 3.16 శాతం, టైటాన్ 0.86 శాతం, ఐటీసీ 0.76 శాతం, ఎంఅండ్‌ఎం 0.75 శాతం, ఎస్‌బీఐ 0.74 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఇన్ఫోసిస్ 1.52 శాతం, ఎయిర్‌టెల్ 0.79 శాతం, టీసీఎస్ 0.58 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.54 శాతం, టెక్ మహీంద్రా 0.54 శాతం నష్టంతో ఉన్నాయి.