అక్షరటుడే, వెబ్‌డెస్క్:Delhi | న్యూఢిల్లీలోని జనపథ్ రోడ్డులోని సీసీఎస్ భవనం(CCS Building)లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం(Major fire incident) చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చేలరేగి భవనం అంతటా వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది(Firefighters) ఘటన స్థలానికి చేరుకున్నారు. 13 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పుతున్నారు. షార్ట్ సర్క్యూట్(Short circuit)తోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
