అక్షరటుడే, హైదరాబాద్: Secunderabad Patni Center : సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నాలుగో అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపకశాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
ప్యాట్నీ సెంటర్ ప్రధాన రహదారిలో ఉన్న బిల్డింగులోని నాలుగో అంతస్తులో రుణాల విభాగం ఉంది. ఇందులో నిన్న రాత్రి ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించడంతో.. స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. క్షణాల్లో అంతస్తు మొత్తం అగ్నికీలలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. కొన్ని గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
