Homeతాజావార్తలుFire Accident | ప్లాస్టిక్​ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

Fire Accident | ప్లాస్టిక్​ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

రంగారెడ్డి జిల్లా షాహిన్‌నగర్‌లో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fire Accident | ప్లాస్టిక్​ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం (Major Fire Accident) చోటు చేసుకుంది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిపడ్డాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా (Rangareddy District) షాహిన్‌నగర్‌లో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

బాలాపూర్​ పోలీస్​ స్టేషన్​ (Balapur Police Station) పరిధిలోని షాహిన్​ నగర్​ సాయిబాబా ఆలయం వెనుక భాగంలో ప్లాస్టిక్ గోదాం గోదాం ఉంది. తెల్లావారుజామున 3:30 గంటల సమయంలో అందులో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో మంటలు చెలరేగి భారీగా ఎగిసిపడ్డాయి. వెంటనే స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు.

Fire Accident | పెద్ద ఎత్తున ప్లాస్టిక్​ గోదాములు

షాహీన్ నగర్ ప్లాస్టిక్ వ్యాపారాలకు కేంద్రంగా ఉంది. దీంతో ఇక్కడ అనేక ప్లాస్టిక్​ గోదాములు (Plastic Warehouses) ఉంటాయి. ప్లాస్టిక్ మెటీరియల్, స్క్రాప్, రీసైకిలింగ్ పదార్థాలు నిల్వ చేస్తారు. అయితే ఇవి త్వరగా మండే స్వభావం కలిగి ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురి అయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.

Fire Accident | రూ.కోటి వరకు ఆస్తి నష్టం

బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ (Balapur Inspector Prasad) మాట్లాడుతూ.. షార్ట్​ సర్క్యూట్​తో మంటలు చెలరేగినట్లు అనుమానించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో గోదాములో నిల్వ చేసిన ప్లాస్టిక్ షీట్లు, పైపులు, రీసైకిల్ మెటీరియల్ పూర్తిగా కాలిబూడిద అయ్యాయి. దీంతో దాదాపు రూ.కోటి వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Must Read
Related News