Homeక్రైంJagtial | జగిత్యాలలో భారీ అగ్ని ప్రమాదం

Jagtial | జగిత్యాలలో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Jagtial | జగిత్యాల జిల్లాలో శనివారం భారీ అగ్ని ప్రమాదం(Major fire accident) చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా థరూర్​లోని ప్లాస్టిక్ పాత సామాను గోడౌన్, టైల్స్ షాప్​లో మంటలు చెలరేగాయి. ప్లాస్టిగ్​ సామగ్రి గోడౌన్(Plastic equipment godown)​ కావడంతో మంటలు వేగంగా అంటుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్మేసింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.కోటి వరకు నష్టం జరిగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది(Firefighters) ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.