ePaper
More
    HomeతెలంగాణHyderabad | హైదరాబాద్​లో భారీ అగ్ని ప్రమాదం

    Hyderabad | హైదరాబాద్​లో భారీ అగ్ని ప్రమాదం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad | హైదరాబాద్​ నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సనత్​ నగర్ ​(Sanat Nagar) పారిశ్రామిక వాడలోని ఓ ప్లాస్టిక్​ పరిశ్రమలో మంటలు చెలరేగాయి.

    నగర శివారులోని పాశమైలారంలో గల సిగాచి పరిశ్రమలో ఇటీవల పేలుడు చోటు చేసుకొని 44 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం అదే ప్రాంతంలోని ఎన్విరో వేస్ట్​ మేనేజ్​మెంట్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. తాజాగా సనత్​నగర్ జింకలవాడలో ఉన్న డ్యూరోడైన్‌ ఇండస్ట్రీస్‌లో (Durodine Industries) గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

    ఈ పరిశ్రమలో పేపర్ ప్లేట్స్(Paper Plates), ప్లాస్టిక్ సామగ్రి(Plastic Utensils) తయారు చేస్తారు. దీంతో మంటలు వేగంగా పరిశ్రమ అంతా వ్యాపించాయి. మంటలు భారీగా ఎగిసి పడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే మంటలు వ్యాపించడానికి కారణాలు తెలియరాలేదు. షార్ట్​ సర్క్యూట్​తోనే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే పరిశ్రమల్లో వరుస అగ్ని ప్రమాదాలతో కార్మికులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

    More like this

    Sharper Mind | మతిమరుపుతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే పాదరసంలాంటి మెదడు మీసొంతం

    అక్షరటుడే, హైదరాబాద్ : Sharper Mind | మారుతున్న జీవనశైలి, ఒత్తిడితో కూడిన పనుల వల్ల చాలా మంది...

    Collectorate building collapses | ఆదిలాబాద్​లో భారీ వ‌ర్షం.. కుప్ప‌కూలిన క‌లెక్ట‌రేట్ భ‌వ‌నం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Collectorate building collapses : ఆదిలాబాద్​ Adilabad లో భారీ వర్షం దంచికొడుతోంది. గురువారం (సెప్టెంబరు...

    Minister Nitin Gadkari | డబ్బులిచ్చి నాపై దుష్ప్రచారం చేయిస్తున్నారు.. పెట్రోల్ లాబీపై కేంద్ర మంత్రి గడ్కరీ ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Nitin Gadkari | కేంద్ర కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి...