Homeక్రైంHyderabad | హైదరాబాద్​లో భారీ అగ్ని ప్రమాదం

Hyderabad | హైదరాబాద్​లో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ Hyderabad లో భారీ అగ్ని ప్రమాదం fire accident చోటు చేసుకుంది. పాతబస్తీలోని మీర్​చౌక్​లో old city meer chowk ఆదివారం ఉదయం గుల్జార్‌హౌస్‌ సమీపంలోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎనిమిది మృతి చెందారు. ఈ భవనంలో పలు వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్​తో మంటలు వ్యాపించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యాపార సముదాయాల గోడౌన్​ ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతోనే మంటల తీవ్రత పెరిగి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.

మంటలు భారీగా చెలరేగడంతో దట్టమైన పొగ అలుముకుంది. దీంతో భవనంలో ఉన్నవారు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. మంటల తీవ్రతకు ఏసీ కంప్రెస్సర్​ పేలింది. ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదంతో పాతబస్తీలో ట్రాఫిక్‌ ఆంక్షలు Traffic restrictions విధించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

Hyderabad | ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి

మీర్​చౌక్​లో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పరిశీలించారు. బాధితులతో ఆయన మాట్లాడారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు. మృతుల్లో మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతి చెందిన వారిని అభిషేక్‌ మోడీ (30), ఆరుషి జైన్‌ (17), హర్షాలి గుప్తా (7), షీతల్‌ జైన్‌ (37), రాజేందర్‌ కుమార్‌ (67), సుమిత్ర (65), మున్నిబాయి (72), ఇరాజ్‌ (2) గా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.