అక్షరటుడే, వెబ్‌డెస్క్: SR Pharma Company : యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri district)లో భారీ అగ్ని సంభవించింది.
చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో ఉన్న ఎస్ఆర్ ఫార్మా కంపెనీ(SR Pharma Company)లో ఈ ఘటన చోటుచేసుకుంది.
శనివారం (ఆగస్టు 23) రాత్రి ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ మంటల కారణంగా కంపెనీలో పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
SR Pharma Company : కార్మికుల ఆగం..
మంటలు భారీగా ఎగిసిపడటంతో కార్మికులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వేగంగా సహయక చర్యలు కొనసాగిస్తున్నారు.
భారీగా ఎగసిపడుతున్న మంటలను ఫైరింజన్ల సాయంతో అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది (Firefighters) శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో కార్మికులు తీవ్ర భయందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
అగ్ని ప్రమాద సమయంలో ఫార్మా కంపెనీలో ఎంతమంది కార్మికులు ఉన్నారనే దానిపై కంపెనీ అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.
అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, అధికారులు ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ (short circuit) వల్లనే మంటలు వ్యాప్తి చెందినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, కార్మికుల వివరాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.